![]() |
![]() |
.webp)
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఎంత ఫేమసో అందరికి తెలిసిందే. సాధారణ మహిళని అసాధారణలో స్థాయి క్రేజ్ వచ్చేలా చేయాలంటే అది సోషల్ మీడియాకే సాధ్యమవుతుంది. తెలుగునాట సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పటికే ఎందరో ఫేమస్ అయ్యారు. ఇక కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో కుమారి ఆంటీ పేరు మారుమోగిపోతోంది. హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే ఓ సాధారణ మహిళ కుమారి ఆంటీ. తనని నేడు సెలబ్రిటీ రేంజ్ కి తీసుకొచ్చారు.
చిన్నా మీది మొత్తం 1000 అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా. కుమారి ఆంటీ డైలాగ్.. ఈ ఒక్క డైలాగ్ తో ఇన్ స్టాగ్రామ్ మొత్తం గత రెండు మూడు వారాలుగా ఒక్కటే మ్యూజిక్.. ఎక్కడ చూసిన కుమారి ఆంటీ రీల్స్, మీమ్స్.. ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. కుమారి ఆంటీ ఏ ముహుర్తానా ఆ వెయ్యి, రెండు లివర్లు ఎక్స్ ట్రా అందో అక్కడి నుండి ఫుల్ ఫేమస్ అయింది. అయితే ఆమె వాయిస్ ని డీజే మిక్స్ చేసి ఎంతోమంది సెలెబ్రిటీలు స్ఫూఫ్ లు చేస్తున్నారు. యాంకర్ సుమ మొదట స్ఫూఫ్ చేయగా మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత బుల్లితెర టీవీ ఆర్టిస్ట్ హరిత జాకీ ఓ రీల్ చేయగా అది ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ వైరల్ గా మారింది. ఇప్పుడు అదే పల్లె పల్లెనా మారుమ్రోగుతుంది. తెలంగాణలో మై విలేజ్ షో ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ, అంజి, అనిల్ జీలా, చందు లాంటివాళ్ళంతా కలిసి ఓ వీడియోని చేసి తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అది ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది. సాధారణంగా గంగవ్వ మాట్లాడితే చాలు, కన్పిస్తే చాలని అనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఈ స్ఫూఫ్ కి యూట్యూబ్ లో అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీల అండ్ టీమ్ హవా నడుస్తుంది. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన 'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు.
![]() |
![]() |